ఉత్తమ ఎస్సైగా ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి
* కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు శేరి బాల నారాయణ గుప్త
* కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో చేర్యాల ఎస్సైకి సన్మానం
కాకతీయ,చేర్యాల: చేర్యాల నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన జి. అపూర్వ రెడ్డిని చేర్యాల పట్టణ కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు శేరి బాలనారాయణ గుప్త ఆధ్వర్యంలో బుధవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శేరి బాల నారాయణ గుప్త మాట్లాడుతూ. రాజకీయ పార్టీలకు,వ్యాపార సంఘాలకు న్యాయబద్ధంగా పనిచేసి ఉత్తమ ఎస్ఐగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఎస్సై అపూర్వ రెడ్డి మాట్లాడుతూ..మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వివరించడం జరుగుతుందని ఎస్సై తెలియజేశారు. ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన స్పందిస్తూ, న్యాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకుండా చూసేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. పౌరులతో సమన్వయం పెంచుకుని మండలాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆమె తెలిపారు.అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో, కిరాణ వర్తక సంఘం కార్యదర్శి అయిత లింగం గుప్త, కోశాధికారి వెల్దె శ్రీనివాస్ గుప్త,బచ్చు రమేష్ గుప్త, స్థానిక కళ్యాణి గార్డెన్ ప్రొప్రైటర్ కాపర్తి చంద్రం గుప్త వారితో పాటు తదితరులు ఉన్నారు.


