జూలూరుపాడులో మద్యం బెల్టు తీయాల్సిందే
లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తాం
జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కి వినతిపత్రం
కాకతీయ, కొత్తగూడెం : జూలూరుపాడు మండల వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించాలని కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలతో పాటు పురుషులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయం ముందు శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మద్యం వ్యాపారాలు బెల్ట్ షాపుల ద్వారా తమ యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారని బెల్ట్ షాప్ ల వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆగమగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడిగా తెరుస్తూ ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబాలను చిదివేస్తూ తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారని దీనిపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇష్టారాజ్యంగా నడుస్తున్న బెల్ట్ షాపుల నియంత్రణపై చర్యలు తీసుకొని పక్షంలో రానున్న రోజుల్లో మండల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ సూపరిండెంట్ దీనిపై స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్కే ఫరీనా, భోగ లక్ష్మి, మంజుల, కాసింబి, నూర్జ తదితరులు పాల్గొన్నారు.


