కాకతీయ – ఏలూరు ప్రతినిధి: తమిళనాడు కోయంబత్తూర్లో ఇటీవల సర్జరీ చేయించుకుని ఇటీవల స్వగృహానికి వచ్చిన చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ కంభం విజయరాజును కామవరపుకోట, జంగారెడ్డిగూడెం వైసీపీ నాయకులు శనివారం పరామర్శించారు. ఏలూరులోని విజయరాజు స్వగృహంలో విజయరాజును పరామర్శించిన వారిలో పార్టీ సీనియర్ నేత, మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా పరిశీలకులు జెట్టి గురునాథరావు, మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పోతన జ్ఞాని, కామవరపుకోట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ, వీరిశెట్టి గూడెం సర్పంచ్ దేవరపల్లి వెంకటేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ గుర్రాల రవి, సీనియర్ నాయకులు పాకలపాటి గాంధీ, బీసీ నాయకులు కానూరి రామయ్య తదితరులు ఉన్నారు.
వైసీపీ ఇన్‌చార్జ్ విజయరాజుకు వైసీపీ నేతల పరామర్శ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


