మాట మాట పెరిగి మర్డర్
మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య.
ఏటూరు గ్రామంలో దారుణం
కాకతీయ, ములుగు ప్రతినిధి : మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడి చేయడంతో ఏటూరు గ్రామానికి చెందిన మడే రాజు(36) మృతి చెందాడు. ఈసంఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరుగ్రామంలో శనవారం రాత్రి జరిగింది. కన్నాయిగూడెం మండలంలో సర్వాయి గ్రామానికి చెందిన నల్లబోయిన బేబిని రాజు కొద్ది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సర్వాయి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం రాత్రి సమయంలో మడే రాజు, కొరం రంజిత్ ఇరువురు మద్యం మత్తులో గొడవ పడ్డారు. వాగ్వాదం ఘర్షణకు దారి తీయడంతో.. కొరం రంజిత్ అనే వ్యక్తి మడే రాజును కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజును ఏటూరునాగారం వైద్య శాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి కూతూరు రాధిక, కూమారుడు రజినీ కాంత్ ఉన్నారు. కాగా ఈ ఘటన పై పోలిసులు కేసు నమోదు చేసి మడే రాజు మృత దేహన్ని ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక అసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.


