కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఫ్రీబస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈస్కీమ్ ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అవుతోంది. ఈ స్కీమ్ వల్ల తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుందని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు మహిళలు వినూత్నంగా ధర్నాకు దిగారు.
ఈ స్కీమును ఎత్తివేసి ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలను కూడా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఫ్రీ ప్రయాణం వల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిందని..నిలబడటానికి కూడా స్థలం లేకుండా పోతుందని వాపోతున్నారు. అయితే వారి ప్రధాన సమస్య రద్దీ మాత్రమే కాదని..ఈ స్కీము వల్ల తాము ఆర్టీసీ సిబ్బంది నుంచి ఎదుర్కొంటున్న అగౌరవంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం చేస్తున్నామన్నచులకన భావంతో కండకర్టుతమను నీచంగా చూస్తున్నారన్నారు. ఆడవాళ్లమనే మర్యాదు కూడా లేకుండా అమార్యాదగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


