మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కొల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు కల్పనా చౌదరి
కాకతీయ కొత్తగూడెం రూరల్ : మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని కొల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు కల్పనా చౌదరి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లోని రేగళ్లలో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్లు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వవాలంబన దిశగా పయనించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు .శిక్షణను పూర్తి చేసిన మహిళలందరికీ కొల్లి ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కల్పనా చౌదరి చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ముత్యం జిల్లా కోఆర్డినేటర్ రూప్లా నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



