వట్టివాగు పనులు నత్తనడకనెందుకు?
ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన రేగా కాంతారావు
కాకతీయ, మణుగూరు: రైతులకు ఉపయోగపడే వట్టివాగు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. బుధవారం కరకగూడెం ఏజెన్సీ మండలంలోని చొప్పాల గ్రామపంచాయితీ పరిధి గొడుగుబండ సమీపంలో ప్రాజెక్టు పనులను ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులు రెండు పంటలు పండించే లక్ష్యంతో గత ప్రభుత్వం తన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పనుల పురోగతిని సమీక్షించిన రేగా, ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు.ప్రాజెక్టు పూర్తయితే స్థానిక రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


