- ముమ్మరంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు
- విద్య, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కాకతీయ, పినపాక: పేదవాడికి కూడు, గూడు కల నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 8, 9, 10 తేదీలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఐలాపురం కస్తూరిబా బాలికల పాఠశాలను పరిశీలించారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ జీవీఆర్ ఫంక్షన్ హాల్ లో సీతంపేట, బోటుగూడెం గ్రామంలో సుమారు 75 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పినపాక తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంకీర్త్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నాగయ్య, హౌసింగ్ ఏఈ వినీత, ఏపీవో వీరభద్రస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామనాథం, మాజీ వైస్ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మనోజ్, మాజీ సర్పంచులు కళ్యాణి, కృష్ణంరాజు, శివశంకర్, నాయకులు బండారు సాంబ, కొండేరు సంపత్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరె నవీన్ కుమార్, కోడెం రామ్మోహన్, పోకల కేశవ్, చీకటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


