కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ను జిల్లా డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) ఏ.శ్రీలత, ఏఎస్‌డబ్ల్యూ హనుమంతరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం జరిగిన ఈ తనిఖీలో వారు హాస్టల్ గదులు, భోజన ఏర్పాట్లు, శుభ్రతను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడిన డీడీ శ్రీలత, మీరు మంచి మర్యాదలతో ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా చదువులో ముందంజ వేయాలని సూచించారు. పిల్లలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నిర్భయంగా తెలిపాలని, వాటిని పరిష్కరించేందుకు శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అయితే, హాస్టల్ నిర్వహణపై ఇంకా మెరుగుదల అవసరమని అధికారులు ఆదేశించారు. విద్యార్థుల ఆశయాలు, అవసరాలపై అధిక దృష్టి సారించాలని అధికారులను ఆమె ఆదేశించారు.


