- సీఐ వెంకటేశ్వరరావు
కాకతీయ, పినపాక: పినపాక మండలాన్ని గంజాయి రహిత మండలంగా మార్చాలని ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు యువతకు సూచించారు. మంగళవారం బయ్యారం, ఏడూళ్ల బయ్యారం సీఐ ఆధ్వర్యంలో సీతంపేట గ్రామంలో గంజాయి సేవించడం వలన కలిగే నష్టాలను వివరించారు . గంజాయి సేవించినా, అమ్మినా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం ఉన్న శిక్షల గురించి వివరించారు.
ఇటీవల నమోదైన గంజాయి కేసులో వ్యాపారం చేసే ముద్దాయిలకు సంబంధించి రూ.23 లక్షల విలువైన వాహనాల మీద ఈ చట్టం ప్రకారం ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి ఉపయోగించితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సురేష్, ఏఎస్ ఐ మల్సూర్, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దు.
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తమ వెంట తీసుకువెళ్లకూడదని సీఐ వెంకటేశ్వర రావు అన్నారు. ఈ.బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారన్నారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని అధికారులకు చూపాలన్నారు.


