మెకానిక్‌ల సమస్యలు తీర్చిస్తాం..వొడితల ప్రణవ్
హుజురాబాద్‌లో టూవీలర్ మెకానిక్స్ భవిష్యత్ సన్నాహక సమావేశం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో మెకానిక్ భవిష్యత్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.మెకానిక్‌లు భారీ సంఖ్యలో పాల్గొన్న సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ.మెకానిక్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లలో వారికి తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల రోజువారీ జీవనంలో మెకానిక్‌ల సేవలు కీలకమని, స్థానిక సమస్యలు తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి పరిష్కారం కోసం ముందడుగు వేస్తానని తెలిపారు.సంఘ సభ్యులకు ఐడీ కార్డులు, నియామక పత్రాలను ప్రణవ్ అందజేశారు. అనంతరం ఆయనకు సంఘం తరఫున ఘన సన్మానం చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర మెకానిక్ సంఘ కార్యవర్గం, హుజురాబాద్ టౌన్,మండల అధ్యక్షులు, నాయకులు, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.



