చేర్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి ముస్ట్యాల తేజ-కాటం సంజీవులు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే అందరి లక్ష్యం కావాలని, నాయకులంతా సమన్వయంతో వ్యవహరించి అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి ముస్ట్యాల తేజ-కాటం సంజీవులు సూచించారు.శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన తేజ -సంజవులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మున్సిపల్ పాలకవర్గం, ప్రభుత్వం ఒక్కటైతే చేర్యాల పట్టణం అభివృద్ధిలో మరింత ముందుకు వెళుతుందని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని కోరారు. మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, చేర్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూడాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అభ్యర్థులకు పట్టం కట్టబెడుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. ఫ్రీ బస్సు, మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ, సబ్సిడీ రుణాలు, రూ.500 గ్యాస్సరఫరా, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు.