“నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చి పనులు పూర్తి చేయాలి”
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్‌కు వెళ్లే రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ మంగళవారం పరిశీలించారు.రోడ్డు పనుల పురోగతి, నిర్మాణ నాణ్యతపై సంబంధిత ఇంజనీర్ అధికారులతో చర్చించి, ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యమే లక్ష్యంగా నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ తెలిపారు.


