కాకతీయ, కొత్తగూడెం : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఓటు చోరీతో ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్ అన్నారు.
విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఓటు చోరీతో ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ తీరును అందరికి అర్ధం అయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న జిల్లా బాడి ఎగ్జిక్యూటివ్ సమావేశం గురించి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజషన్ అడ్మిన్ అండ్ మీడియా సెల్ ఇంచార్జ్ మౌనిష్ గౌడ్, జిల్లా ఆర్గనైజషన్ అడ్మిన్ అండ్ లీగల్ సెల్ ఇంచార్జ్ రామ్మూర్తి, (రాము) జనరల్ సెక్రటరీ ప్రణయ్, సెక్రటరీ అశోక్, కొత్తగూడెం అసెంబ్లీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, సంపత్, మండల ప్రెసిడెంట్లు శ్రీకాంత్, శివకుమార్, టౌన్ కొత్తగూడెం ప్రెసిడెంట్ జయసూర్య, వైస్ ప్రెసిడెంట్స్ ఉర్సు శివకుమార్, ఉస్మాన్ అలీ, జనరల్ సెక్రటరీ నర్సింగ్ పాసి, పాల్వంచ టౌన్ వైస్ ప్రెసిడెంట్ భరత్, రూరల్ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, సందీప్, కోటేష్, పృథ్వి,గాయత్రీ, జీనత్ తదితరులు పాల్గొన్నారు.


