మా చేతిలో ఏమీ లేదు
సీఐపై విచారణ చేపట్టి నివేదిక అందించాం
చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు
జిల్లా ఎక్సైజ్ అధికారి. .. జానయ్య
కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ పై ఎక్సైజ్ సీఐ వేధింపులకు గురి చేస్తుందని మనస్థాపంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడిన సంఘటనపై సర్వత్ర చర్చాంశానియమైంది. వేధింపుల పరవాన్ని తట్టుకోలేక ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ముకుమ్మడిగా విధులు బహిష్కరించి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా సీఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. సదరు జిల్లా అధికారి సిబ్బంది, సీఐ పరస్పర ఫిర్యాదుల మేరకు వేధింపులకు పాల్పడిన సిఐను బాధితురాలు మహిళ కానిస్టేబుల్ ను విడివిడిగా విచారణ చేపట్టిన ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్ జానయ్య సంబంధిత నివేదికను చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు సమర్పించామని కాకతీయ న్యూస్ కు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే కావాలనే సూపరిండెంట్ జానయ్య జాప్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జానయ్య వివరణ ఇస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ బాధితురాలు మహిళా కానిస్టేబుల్ ఇద్దరు తమ శాఖకు చెందినవారేనని ఈ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని విచారణ అంశాలను పారదర్శకంగా చేపట్టి చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని తెలిపారు. త్వరలో సీఐపై ఏ మేరకు వేటు పడుతుందో వేచి చూడాలని తెలిపారు.


