జలకు వేగవంతమైన సేవలు అందించాలి
: భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం: రెవెన్యూ సేవల్లో నాణ్యతను పెంచుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా, ఖమ్మం–కల్లూరు డివిజన్లు, కలెక్టరేట్ యూనిట్ల నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి బి. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, జిల్లా కోశాధికారి క్రాంతి కుమార్, గౌరవ అధ్యక్షులు రవీందర్, ముజాహిద్, సాయి నరేష్, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు సీహెచ్. సురేష్, కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కల్లూరు డివిజన్ అధ్యక్షులు టి. కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి డి. కరుణశ్రీ, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు పి. రాజేష్, కార్యదర్శి బి. రవి తదితరులు పాల్గొన్నారు.


