కాకతీయ, బయ్యారం: మండలంలోని బయ్యారం చెరువు నుండి లింగగిరి గ్రామానికి వెళ్లే రహదారిలో బయ్యారం పెద్ద చెరువు లోతట్టు సమీప ప్రాంతంలో ఓ రైతు బోర్వెల్ నుంచి కరెంట్ మోటార్ వేయకుండానే నీరు ఉబికి బయటకు వస్తోంది. తాము సాగు చేస్తున్న వరి పంటకు కాలువ ద్వారా నీరు పారుతుందని రైతులు ఆనందపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. బోర్ లో నుంచి నీరు ఉబికి వస్తున్న విషయాన్ని గమనిస్తూ గంగమ్మ అటుగా వెళ్లే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


