గ్రామాలు దేశానికే పట్టుకొమ్మలు
కాకతీయ, చేర్యాల: చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో మండలంలోని ముస్త్యాల గ్రామంలో నిర్వహిస్తున్న శీతాకాల శిబిరం నాలుగవ రోజున గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్తవెయ్యకు.. పాపం చేయకు .. యువత మేలుకో.. అంటూ వీధులలో తిరుగుతూ నినాదాలు చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గంగయ్య మాట్లాడుతూ… గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని అవి బాగున్నపుడే దేశం బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత సమాజ పరిశుభ్రత పాటించాలని అన్నారు. కార్యక్రమంలో యాదగిరి, అధ్యాపకులు వాలంటీర్లు పాల్గొన్నారు


