కాకతీయ, బయ్యారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవిన్యూ గ్రామంలోని రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు మండలంలోని 17 రెవిన్యూ గ్రామాలలో 11 మంది గ్రామ పరిపాలన అధికారులను క్లస్టర్ గా విభజించి బదిలీపై ఈ నెల 9న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని, మండలానికి వచ్చినట్లు మండల తాహశీల్దార్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
వారిలో రెవిన్యూ గ్రామం లు , క్లస్టర్ల వారిగా,పర్సిక పండయ్య, గౌరారం రెవిన్యూ లోని, గౌరారం గ్రామ క్లస్టర్, దాసరిమహేశ్వర్, గంధంపల్లి రెవిన్యూ పరిధిలోని గంధంపల్లి క్లస్టర్, బొల్లు శిరీష కొత్త పేట రెవిన్యూ గ్రామంలో కొత్త పేట గ్రామ క్లస్టర్ గా, రాచకొండ సుమతి, ఉప్పలపాడు రెవిన్యూ గ్రామంలో ఉప్పలపాడు గ్రామ క్లస్టర్ గా, దొంతరాబోయిన భాస్కర్ ఇర్సులాపురం రెవిన్యూ గ్రామంలో ఇర్సులాలాపురం గ్రామ క్లస్టర్ గా, మద్ది శ్వేత, సింగారం రెవిన్యూ గ్రామంలో సింగారం గ్రామ క్లస్టర్ గా, సింఘాని ప్రభాకర్ , బయ్యారం రెవిన్యూ గ్రామంలోని బయ్యారం క్లస్టర్ గా, పత్తిరి ఉమేష్ , లింగగిరి రెవిన్యూ గ్రామం లోని లింగ గిరి,కాచన పల్లి గ్రామాల క్లస్టర్గా, పడిగ కవిత, రామచంద్రపురం రెవిన్యూ గ్రామం రామచంద్రపురం, మొట్ల తిమ్మాపురం,గ్రామాల క్లస్టర్ గా,బేతమల్ల బాబు, కంబాలపల్లి రెవిన్యూ గ్రామం లో కంబాల పల్లి,జగత్ రావు పేట, గ్రామాల క్లస్టర్ గా,వాసం వెంకటయ్య,వెంకటాపురం రెవిన్యూ గ్రామంలోని వెంకటాపురం, కొమ్మవరం గ్రామంలోని క్లస్టర్ గా విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


