వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం దేవాలయ చైర్మన్ నరసింహ ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయం నిండా వేదఘోషాలు, మంగళ వాద్యాలు మార్మోగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలేరు శివాజీ, లాలు, హరికృష్ణ, బుచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.


