ఉపాధిని దెబ్బతీస్తున్న వీబీజీ రాంజీ పథకం
కాకతీయ, ఖమ్మం : ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, విబిజి రాంజీ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షురాలు జి.లలిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ మహిళల ఉపాధిని దెబ్బతీస్తున్న విబిజి రాంజీ పథకాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు గ్రామాల్లో జనరల్ బాడీలు నిర్వహించి, మార్చి 8న ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ, ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండి గ్రామీణ మహిళల హక్కులను హరించేదిగా ఉందని విమర్శించారు. సమావేశంలో జిల్లా నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


