కాకతీయ, బయ్యారం: మండలంలో పట్టా కలిగిన రైతులు తమ పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లను గ్రామపంచాయతీ కార్యదర్శికి ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని ఏవో రాంజీ శనివారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల, అధికారుల సమన్వయంతో రైతులకు యూరియా పంపిణీ జరుగుతుందని, కౌలు రైతులు, పట్టా పాస్ బుక్ లేనివారు రెవెన్యూ, వ్యవసాయ విస్తరణ అధికారి సర్టిఫైతో, సాగు రైతులకు యూరియా అందజేస్తారని ఆయన తెలిపారు. రైతులు గమనించి యూరియా సక్రమంగా అందేలా సహకరించాలన్నారు. రైతులకు యూరియా కేటాయించిన ప్రాంతంలోనే పంపిణీ జరుగుతుందని తెలిపారు.


