epaper
Monday, March 2, 2026
epaper

యూరియాను నేరుగా అందించాలి : ఏఐకేఎంఎస్ డిమాండ్

యూరియాను నేరుగా అందించాలి : ఏఐకేఎంఎస్ డిమాండ్

కాకతీయ, కూసుమంచి : రైతులకు యూరియాను యాప్ విధానం ద్వారా కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు యూరియా పంపిణీలో యాప్ విధానం తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువురాని రైతులు, సెల్‌ఫోన్ లేని రైతులు ఈ విధానంతో యూరియా పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. షాపుల వద్దకు యూరియా కోసం వెళ్లిన రైతులను “ముందుగా యాప్‌లో బుక్ చేసుకోవాలి” అంటూ వెనక్కి పంపిస్తున్నారని చెప్పారు. ఇదే అవకాశంగా కొందరు డీలర్లు రైతుల పేరుతో యాప్‌లో బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో ఒక కట్ట యూరియాను రూ.500 నుంచి రూ.600 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. కూసుమంచి మండలానికి రావాల్సిన యూరియా ఇతర మండలాలకు అక్రమ మార్గాల్లో తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా అందించే పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, రైతుబంధు పథకాన్ని తక్షణమే రైతులు, కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని, ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకుడు కలకొండ సురేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, నాయకులు బత్తుల ఉప్పయ్య, నోముల రంగారావు, నిమ్మల వెంకన్న, కలకొండ కల్పన తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img