epaper
Monday, March 2, 2026
epaper

యూరియా అమ్మకాలు యాప్ ద్వారానే

యూరియా అమ్మకాలు యాప్ ద్వారానే

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో సోమవారం నుంచి యూరియా అమ్మకాలు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వానాకాలంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి అర్హ రైతుకు అవసరమైన యూరియాను పారదర్శకంగా అందించడం, ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడి రైతులు ఆందోళన చెందకుండా చేయడం, జిల్లాలో ఎక్కడ ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతులు తమ పంట రకం, సాగు విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సహకార సంఘం వద్ద ఉన్న యూరియానైనా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.

24 గంటల్లో కొనుగోలు తప్పనిసరి

యూరియా బుక్ చేసుకున్న రైతు 24 గంటలలోపు సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. నిర్ణీత సమయంలో తీసుకోకపోతే బుకింగ్ రద్దు అవుతుందని, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పట్టాదారులు, పట్టా పుస్తకం లేని రైతులు, కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కౌలు రైతులు భూమి యజమాని పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో బుకింగ్ చేయవచ్చని, ఇందుకు పట్టాదారు ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఔట్‌లెట్ వద్ద వ్యవసాయ శాఖ సిబ్బందిని లేదా సంబంధిత ఏఈఓను నియమిస్తామని తెలిపారు. డీలర్లు, సహకార సంఘాలు యాప్ ద్వారానే యూరియా అమ్మకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img