epaper
Monday, March 2, 2026
epaper

సీల్డ్ కవర్ తెరుచుకోగానే సుజాతరామనాథం పేరు…

సీల్డ్ కవర్ తెరుచుకోగానే సుజాతరామనాథం పేరు…
మధిర మున్సిపల్ చైర్మన్‌గా సామినేని సుజాతరామనాథం ఎంపిక
ముగ్గురు ఆశావహుల్లో చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ
కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్‌తో ప్రకటించిన నిర్ణయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయానికి నాయకుల స్వాగతం
మిగతా అభ్యర్థుల నుంచి పూర్తి మద్దతు… ఐక్యతకు సంకేతం
మధిర అభివృద్ధే లక్ష్యం అని నూతన చైర్మన్ స్పష్టం

కాకతీయ, ఖ‌మ్మం బ్యూరో : మధిర మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీల్డ్ కవర్ ద్వారా సామినేని సుజాతరామనాథం పేరును ఖరారు చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, చివరకు అధిష్టానం ఈ నిర్ణయంతో సస్పెన్స్‌కు తెరదించింది. మధిర మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి వేమిరెడ్డి లక్ష్మీ తులసీ, రంగా రూపా, సామినేని సుజాతరామనాథం పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ ముగ్గురూ బలమైన అభ్యర్థులుగా నిలవడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందన్న దానిపై చివరి వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానిక సమీకరణాలు, పార్టీ బలం, సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం చివరకు సామినేని సుజాతరామనాథం వైపు మొగ్గు చూపింది.

సీల్డ్ కవర్‌తో ప్రకటించిన అధిష్టానం

కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్‌లో ఉన్న పేరును అధికారికంగా ప్రకటిస్తూ సామినేని సుజాతరామనాథాన్ని మధిర మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎంపిక చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజాతరామనాథం ఎంపిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంతో చైర్మన్ పదవిపై కొనసాగిన అనిశ్చితి పూర్తిగా తొలగిపోయింది. చైర్మన్ పదవికి పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ సామినేని సుజాతరామనాథానికి అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. మధిర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధే లక్ష్యం : సుజాతరామనాథం

ఈ సందర్భంగా సామినేని సుజాతరామనాథం మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి చైర్మన్ పదవిని అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మధిర మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మధిర మున్సిపల్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img