అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాం
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర కృష్ణ పాల్గొని పిల్లలకు యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుర్ర కృష్ణ మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రాలకు కూడా ప్రభుత్వం యూనిఫాం పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రీ–ప్రైమరీ స్థాయిలోనే పిల్లల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందించేందుకు యూనిఫాం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఉపేంద్రమ్మ, పంచాయతీ కార్యదర్శి మాధవి, కూసుమంచి సెక్టార్ సూపర్వైజర్ సువర్చల, ఉపసర్పంచ్ కొమ్ము ఎల్లమ్మ, ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మయ్య, ఉపాధ్యాయురాలు సుభాషిణి, గ్రామ దీపిక వినోద, ఆశా కార్యకర్త లింగవేణి, గ్రామ పెద్దలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.


