epaper
Sunday, March 1, 2026
epaper

అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన‌ పాత కామిక్ బుక్‌!

అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన‌ పాత కామిక్ బుక్‌!
శాన్‌ఫ్రాన్సిస్కో సంచలనం
తల్లి ఇంటిని శుభ్రం చేస్తుండ‌గా దొరికిన సూపర్‌మ్యాన్ కామిక్ బుక్‌
రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ముగ్గురు సోద‌రులు

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మే క్రమంలో నిండా జ్ఞాపకాలతో కూడిన ఆపుర్వమైన ప్రయాణం మొదలవుతుంది. కానీ ఆ ప్రయాణం ముగ్గురు యువకులకు రాత్రికిరాత్రే కోటి కోట్లు ఆర్జించే అదృష్టాన్ని తెస్తుందని ఎవరు ఊహిస్తారు? అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ నిజ జీవిత కథ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారింది.

తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ మహిళ కన్నుమూయడంతో ఆమె ముగ్గురు కుమారులు తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మ ఇంటిని చివరిసారిగా శుభ్రం చేస్తూ, పాత సామాన్లను తొలగిస్తుంటే ఓ పాతకాలం నాటి సూపర్‌మ్యాన్ కామిక్ పుస్తకం వారి దృష్టికి పడింది. మసకబారిన కవర్‌, పాత పేజీలు.. కానీ అందులో దాగి ఉన్న విలువ మాత్రం ఊహకు అందనిది. ఆ కామిక్ పుస్తకం దశాబ్దాల కిందట విడుదలైన అరుదైన ఎడిషన్‌ అని గుర్తించిన ముగ్గురు సోదరులు దానిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం టెక్సాస్‌లోని ఓ ప్రఖ్యాత వేలం సంస్థను సంప్రదించారు. వేలం మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఆసక్తికరమైన బిడ్డింగ్‌ యుద్ధం మొదలైంది. చివరికి ఆ అరుదైన కామిక్ పుస్తకం ఏకంగా 9.12 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో దాదాపు రూ.81.25 కోట్లకు అమ్ముడైంది. ఒక కామిక్ పుస్తకం ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి అని వేలం నిర్వాహకులు చెప్పారు.

మొత్తానికి పాత ఇంటి శుభ్రపరిచే పనిలో దొరికిన వస్తువు ఇలా ముగ్గురు సోదరుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. వారికి ఇది నిజంగా అనుకోని అదృష్టం, ఒక పుస్తకం రూపంలో దొరికిన అరుదైన వరం. పాత ఇంటిలో దొరికిన ఈ చిన్న కామిక్… ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలెక్టర్ల ఐటెమ్‌ల జాబితాలోకి చేరిపోయింది. ఒక సాధారణ రోజును అసాధారణ అదృష్ట క్షణంగా మార్చిన ఈ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img