పోలీసులు మీకోసం అను శీర్షికన
-పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన సదస్సు..
కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో సోమవారం రోజు జడ్పీహెచ్ఎస్ కేశవపట్నం, కేజీబీవీ, మోడల్ స్కూల్, ఆల్ ఫ్రెండ్ నోబెల్ స్కూల్, కృష్ణవేణి పాఠశాలలకు చెందిన సుమారు 204 మంది విద్యార్థులకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం “పోలీసులు మీకోసం”అనే శీర్షిక నా రాబోయే పదవ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఏసిపి మాధవి, హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎసిపి మాధవి మాట్లాడుతూ భవిష్యత్తు లక్ష్య సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విధానం, ఒత్తిడిని అధిగమించే పద్ధతులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఐసిఐ రీజినల్ ప్రెసిడెంట్, మోటివేషనల్ స్పీకర్ మరియు లైఫ్ స్కిల్స్ ట్రైనర్ కే. తిరుపతి, లైఫ్ మోటివేషనల్ స్పీకర్ పీఏపీ స్వామి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్స్, వాటర్ బాటిల్స్‌ను ఏసీపీ మాధవి, సీఐ వెంకట్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


