epaper
Monday, March 2, 2026
epaper

ఒకే ఇంటికి రెండు నెంబర్లు!

ఒకే ఇంటికి రెండు నెంబర్లు!
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే అడ్డంకి
ఇద్దరికి ఒకే ఇంటి నెంబర్ కేటాయింపుపై ప్రశ్నలు
రెండుసార్లు విచారణ చేసినా మారని రికార్డులు
ఉన్నతాధికారుల ఆదేశాలకూ లెక్కలేదన్న ఆరోపణలు
ఖమ్మం కార్పోరేష‌న్ అధికారుల విచిత్రాలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించిన ఘటన ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలనుకున్న ఓ మహిళకు అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన కరుణ అనే మహిళ తన పాత ఇంటిని తొలగించి, అదే స్థలంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమెకు కేటాయించిన ఇంటి నెంబర్ 4-8-111/9 ను అదే ప్రాంతంలోని మరో ఇంటికి కూడా కేటాయించినట్లు బయటపడింది. దీంతో అధికారిక రికార్డుల్లో ఒకే నెంబర్ రెండు ఇళ్లకు ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది.

ఖ‌మ్మం కార్పోరేష‌న్ అధికారుల‌ను నిల‌దీస్తున్న బాధిత మ‌హిళ‌

 

డబ్బులు లేవు.. నెంబర్ సమస్యలు

తాను ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే, ఎంక్వయిరీకి వచ్చిన అధికారుల ద్వారానే ఈ గందరగోళం తెలిసిందని కరుణ వాపోయింది. ఇంటి నెంబర్ ఒకేలా ఉండటంతో లోన్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బై నెంబర్ కేటాయించి, ఇంటి పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని పలుమార్లు మున్సిపాలిటీ రెవెన్యూ సిబ్బందిని కోరినా స్పందన లేదని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగినప్పటికీ, అధికారులు ఇంటి నెంబర్ సరిచేయలేదని కరుణ తెలిపింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సిబ్బంది మాత్రం అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం

బై నెంబర్ కోసం దరఖాస్తు చేసి దాదాపు 20 రోజులుగా మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని కరుణ వాపోయింది. సామాన్య ప్రజల సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, తమ నిర్లక్ష్యం వల్ల తాను పొందాల్సిన లోన్లు, ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని ఆమె ఆరోపించింది. మొత్తానికి… ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఇల్లు కట్టుకోవడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img