ప్రజాకవి అందెశ్రీ కి నివాళులు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రకృతికవిగా కీర్తి అందుకున్న అందె శ్రీ అకాల మరణం సమాజానికి తీరని లోటని తెలంగాణ ఉద్యమకారులు శ్రద్ధాంజలి అన్నారు. సోమవారం కొత్తగూడెం ఉద్యమకారుల కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన పాట, మాట ద్వారా సామాన్య ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అందెశ్రీ మరణం నేటి ప్రజా చైతన్యానికి తీరని లోటని వారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలకపాత్ర పోషించారన్నారు. జీవితాంతం ప్రజా కళాకారుడిగా, నిరాడంబరుడిగా జీవించారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు మల్లెల రామనాథం, బరగడి దేవదానం, ఎస్.కె. నబి సాహెబ్, బుడగం నాగేశ్వరరావు, ఎస్డిటి హుస్సేన్, బండి రాజుగౌడ్, రియాజ్ అహ్మద్, ఎస్ వెంకటేశ్వర్లు , తుంపూరి శివ, రాగన బాబు తదితరులు నివాళులు అర్పించారు.


