epaper
Monday, March 2, 2026
epaper

అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు

అర్హులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్

కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెలరోజులు ఆలస్యంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు ఈ ప్రోత్సాహకం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కాలర్‌షిప్‌లు, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

సదరం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక నిఘా

అర్హులైన దివ్యాంగులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ర్యాండమ్‌గా తనిఖీ చేసి, అర్హులకు మాత్రమే సర్టిఫికెట్లు అందుతున్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో కంటి చూపు సమస్య కారణంగా బిడ్డను పాఠశాలకు పంపలేకపోతున్నారని వచ్చిన దరఖాస్తును ప్రస్తావిస్తూ, ఖమ్మం జిల్లాలో కంటి చూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి విజేత, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డా. వేణుమాధవ్, డీహెచ్‌ఈడబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సంబంధిత అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img