కాకతీయ, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్‌లో మృత్యువుతో ముగిసిన దుర్ఘటన చోటుచేసుకుంది. చండ్లాపూర్‌కు చెందిన మూర్తి గజేందర్ రెడ్డి, అతని కుమారుడు రాజిరెడ్డి గంగాపూర్ పరిసరాల్లోని వ్యవసాయ బావి వద్ద అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను రక్షించేందుకు వైర్ చుడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. ఇదే ఇంట్లో ఐదు రోజుల క్రితం గజేందర్ రెడ్డి తన కుమార్తె పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెళ్లి సందడిని మిగిల్చిన ఆ ఇంట్లో విషాదం నెలకొనడంతో చండ్లాపూర్ గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సిద్దిపేట జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో తండ్రి, కొడుకు మృతి..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


