భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల..
కాకతీయ, తిరుమల :
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం అన్నీ కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, టోకెన్ లేని భక్తులు బయట క్యూలైన్‌లో వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు దర్శనం కలగడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,112 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,331 గా నమోదు అయింది. భక్తుల భక్తిశ్రద్ధకు నిదర్శనంగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లుగా లెక్కించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. తాగునీరు, ఆహారం, వైద్యసదుపాయాలు, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.


