కాపర్ దొంగలించిన ముగ్గురి అరెస్టు
100 కిలోల కాపర్ వైర్, స్కూటీ స్వాధీనం
పరారీలో మరో ముగ్గురు నిందితులు
సింగరేణి రూరల్ సీఐ నునావత్ సాగర్
కాకతీయ, కామేపల్లి : కామేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సింగరేణి రూరల్ సీఐ నునావత్ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 20న కామేపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని నిలిపి విచారించగా నిందితులు వరుస దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. విచారణలో కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం అర్బన్, రూరల్, నేలకొండపల్లి, కొణిజర్ల పరిధిలో మొత్తం 13 కేసుల్లో సుమారు 19 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 100 కిలోల కాపర్ వైర్, దొంగతనానికి ఉపయోగించిన స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్ఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు ప్రజా భద్రతకు ముప్పని హెచ్చరించారు.


