కాకతీయ, నేషనల్ డెస్క్: ఆఫ్రికా దేశంలో విషాదం నెలకొంది. సూడాన్ లో ఘోర ప్రక్రుతి విపత్తు చోటుచేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో వెయ్యి మందికిపైనే ప్రజలు మరణించారు. ఈ విషయాన్ని సూడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ ధ్రువీకరించింది. రోజుల తరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్లు అధికారులు తెలిపారు.
విషాదం.. విరిగిపడ్డ కొండచరియలు.. వెయ్యి మంది దుర్మరణం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


