తవ్వారు మరిచారు .. ఆదమరిస్తే అంతే
* మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
కాకతీయ, చేర్యాల : నిత్యం రద్దీగా ఉండే చేర్యాల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న త్రాగునీటి కాలువ పైపు పగిలి వాటర్ లికేజి అవుతున్నాయని స్థానికులు మున్సిపాలిటీ కార్యాలయంలో సమాచారం ఇవ్వగ స్పందించిన యత్రాంగం మున్సిపల్ సిబ్బందితో పూడిక తీయించారు. పూడిక తీసి పది రోజులు గడుస్తున్నప్పటికీ. తీసిన పూడికను మరిచిపోయినట్టుగా గాలికి వదిలేశారు.గుంత ప్రమాదకరంగా మారినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలోని స్థానిక అంగడి బజారు దగ్గర జాతీయ రహదారి రోడ్డు పక్కనే తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ప్రమాదశాత్తు అందులో పడితే మాత్రం ప్రాణాలు పోయినట్టే.. జనగామ, సిద్దిపేట వెళ్లాలంటే ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే. ఇలా నిత్యం రద్దీగా ఉండే రహదారిపై గుంత ఏర్పడినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపింస్తున్నారు.ప్రమాదాన్ని సూచిస్తూ.. కొందరు గుంతలో చెక్కలు తదితర వాటిని వేసినప్పటికీ.. ఆదమరిచి ఎవరైనా వాహనం నడిపితే ప్రమాదం బారిన పడక తప్పదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ కు మరవత్తులు చేపించి పూడిక కూల్చేసి,సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే హడావుడి చేసే అధికారులు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను మాత్రం చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.


