ఛాంబర్ లో మరోసారి మాటేటి ప్రభంజనం
కాకతీయ,ఖమ్మంప్రతినిధి : నిన్న జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ 672 ఓట్లతో కురవెల్ల & గుడవర్తి ప్యానెల్ నుండి సెంట్రల్ ఈసీ గా మాటేటి కిరణ్ కుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన కురువల్లి ప్రవీణ్ కుమార్ , గొడవర్తి శ్రీనివాస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . అలాగే ఓట్లు వేసి గెలిపించిన వారికి ప్రత్యేకంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు . అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్యులకు ఎల్లప్పుడూ మా మాటేటి కుటుంబం అండగా ఉంటుందని , సర్వ సభ్యుల ప్రేమ , అభిమానం , ఆప్యాయత ఎప్పటి లానే ఎల్లప్పుడూ మా మాటేటి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు .


