epaper
Thursday, January 15, 2026
epaper

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి
ట్రంప్ సామ్రాజ్యవాద అహంకారాన్ని ఖండించాలి
వెనుజువేలాపై సహజ సంపదల కోసమే యుద్ధం
సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్
ట్రంప్ దిష్టిబొమ్మ దహనం

కాకతీయ, తుంగతుర్తి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురాహంకార వైఖరితో సాటి దేశమైన వెనుజువేలాపై అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపిస్తూ దురాక్రమణకు పాల్పడటాన్ని యావత్ ప్రపంచ ప్రజలు తీవ్రంగా ఖండించాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న జ్యోతిబాపూలే విగ్రహం సమీపంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ… వెనుజువేలా దేశం తమ దేశంలోకి మత్తు పదార్థాలు రవాణా చేస్తోందన్న నెపంతో అమెరికా దాడి చేయడం పూర్తిగా అబద్ధమని విమర్శించారు. వాస్తవానికి వెనుజువేలాలో ఉన్న చమురు, బంగారం వంటి సహజ ఖనిజ సంపదలను దోచుకునేందుకే ట్రంప్ ఈ కుట్ర పన్నాడన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సహజ వనరులు, మానవ వనరులను కొల్లగొట్టడంలో అమెరికా అధ్యక్షుడు అందవేసిన చేయి అని ఆరోపించారు.

ప్రజాస్వామ్యానికి ముప్పు
దాడి అనంతరం ‘ఇంతటితో యుద్ధం ముగియలేదు, మా చెప్పుచేతల్లో ఉండే పాలక వర్గాన్ని అక్కడ నియమిస్తాం’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన సామ్రాజ్యవాద అహంకారానికి నిదర్శనమన్నారు. శాంతి బహుమతులు కావాలని కోరుకునే ట్రంప్ స్వయంగా యుద్ధాలకు తెగబడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దురాక్రమణ దాడులను, యుద్ధాలను ప్రపంచ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేర్పుల లక్ష్మన్న, నాయకులు ఈదుల యాదగిరి, ఎండి జానీబేగం, కందుకూరు రవి, పత్తేపురం వెంకన్న, ఈదుల రవి, ఈదుల ఉపేందర్, వడ్డే పున్నం తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ ఇంటిలో, కార్యాలయంలో...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టోకు కార్యరూపం కోతుల బెడదకు చెక్ పెట్టిన...

విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం

విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం హామీల‌ను నిల‌బెట్టుకోని ప్ర‌భుత్వం తుంగ‌తుర్తిలో ఎక్క‌డా చూసినా స‌మ‌స్య‌లే తుంగతుర్తిలో...

ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి

ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి వారబంది విధానంతో చివరి ఆయకట్టుకు నష్టం చివరి దశలో...

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి కాకతీయ, తుంగతుర్తి : మండల కేంద్రంలో...

“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు”

“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు” పార్టీ కార్యాలయంలో బీసీ నేతపై దాడి నాగం అనుచరుల...

గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి

గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి...

ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే

ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే కాకతీయ, మిర్యాలగూడ : మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img