నవ లిమిటెడ్ సేవలు అభినందనీయం
టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ మల్లేశ్వర గుప్తా
నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల ప్రధానం
కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ “నవ లిమి టెడ్” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ టి.మల్లేశ్వర గుప్తా పేర్కొన్నారు. పాల్వంచ నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రం నందు టాలీ డీటీపీ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బుధవారం యోగ్యత పత్రాల ప్రధాన బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లేశ్వర గుప్తా పాల్గొని ప్రసంగించారు. టాలీ ప్రాముఖ్యత ఉద్యోగ అవకాశల గురించి వివరించారు. అలాగే నవ లిమిటెడ్ చేపట్టిన సి ఎస్ ఆర్ కార్యమాలను అభినందించారు. అనంతరం నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సి.ఎస్ఆర్, ఎంజిఎం ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు నవ లిమిటెడ్ చేపట్టిన కారక్రమాల గురించి వివరించారు. మహిళా సాధికార కేంద్రం శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ అనంతరం ఉపాధి అవకాశలను కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టాలీ కోర్స్ లో శిక్షణ తీసుకున్న కవిత మాట్లాడుతూ మహిళా సాధికారత కేంద్రం తమ లాంటి వారికి ఎందరికో ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. అనంతరం అతిధుల చేతిలో మీదుగా డీటీపీ టాలీలో శిక్షణ తీసుకున్న విద్యార్థినిలకు యోగ్యత పత్రాలని అందచేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం కమర్షియల్ ఎన్.ప్రసాద్, టి.అరుణ, దివ్య, శిరీష, రాజేశ్వరావు, వెంకట్ విద్యార్థినులు పాల్గొన్నారు.


