రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయాలి
: ఏసీపీ శ్రీనివాసులు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు తెలిపారు. కారేపల్లి, కామేపల్లీ మండలం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందోబస్త్ కు కేటాయించిన పోలీస్ సిబ్బంది యొక్క విధివిధానాలపై అవగాహన కార్యక్రమం కామేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ..పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకొవాల్సిన ముందస్తు బందోబస్తు చర్యలు చేయాలన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులు గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పోలీస్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు. పోలీంగ్ కేంద్రాలోకి ఓటర్లు వచ్చి వేళ్ళే మార్గాలలో వాహనాలు పార్కింగ్ చేయకుండా చూసుకోవాలన్నారు. ఏదైన సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులను సమచారం ఇవ్వడంతో పాటు అదనపు పోలీసు బలగాలను రప్పించుకోవాలన్నారు.


