చేయూత నందించిన సర్పంచ్
కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల పరిధిలోని ఎదిర పంచాయతీ లో మేమున్నామంటూ సర్పంచ్ దంపతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేయూత నిందించారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి తన గృహంలో కాలు జారి కింద పడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తరువాత తనని వెళ్ళి పరామర్శించి తగిన సహాయం అందించారు. అనంతరం స్థానిక చర్చి లో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువత కి క్రికెట్ ఆట కోసం గ్రౌండ్ ని శుభ్రం చేయించారు. యువత సర్పంచ్ పర్షిక శ్రీలత సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల క్రాంతి కుమార్, గంగరాజు,జాడి, రాంబాబు, బిక్షపతి కి కృతజ్ఞతలు తెలిపారు.


