epaper
Monday, March 2, 2026
epaper

కొత్తగూడెంలో ఎగిరేది ఎర్ర జెండానే

కొత్తగూడెంలో ఎగిరేది ఎర్ర జెండానే
కార్పొరేషన్ అభివృద్ధికి సీపీఐనే మార్గదర్శి
ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి
అహంకార రాజకీయాలకు ప్రజల తీర్పు అవసరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీపీఐ జోరు కొనసాగుతోంది. ఈ గడ్డపై ఎగిరేది ఎర్ర జెండానేనని, ప్రజల సంక్షేమానికి సీపీఐనే నిజమైన దిక్సూచి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58, 59, 60 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడిందని, కొత్తగూడెం అభివృద్ధిలో సీపీఐ పాత్ర చిరస్మరణీయమని కూనంనేని తెలిపారు. బస్తీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం పోరాడుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్పొరేషన్ పాలన సాగాలంటే ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అభివృద్ధి అంటే మాటలు కాదు–పనులు

ఎమ్మెల్యేగా గడిచిన రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని కూనంనేని తెలిపారు. ప్రభుత్వంతో పోరాడి అవసరమైన నిధులు తెచ్చి, కొత్తగూడెంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ విజయం సాధిస్తే ప్రజల సమస్యలు మరింత వేగంగా పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు, ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి రాజకీయాలకు ఈ ఎన్నికలు గుణపాఠం కావాలని, ప్రజలు చైతన్యంతో ఓటేయాలని పిలుపునిచ్చారు.

పారదర్శక పాలనకు సీపీఐ విజయం అవసరం

కార్పొరేషన్ పాలనలో పారదర్శకత, ప్రజాప్రయోజనాలు ముందుండాలంటే సీపీఐ అభ్యర్థుల గెలుపు అనివార్యమని కూనంనేని అన్నారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి జీవితాల్లో మార్పు రావడమే నిజమైన అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సీపీఐ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రజల అండతో కార్పొరేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అహంకారంతో వ్యవహరించే రాజకీయ శక్తులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, నిబద్ధతతో పనిచేసే సీపీఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రోడ్ షోలు, ప్రచార సభలకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే విజయంపై పూర్తి నమ్మకం ఉందని కూనంనేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్‌కే ఫహీమ్‌తో పాటు సీపీఐ అభ్యర్థులు మూడ్ గణేష్, సహేరా మహమ్మద్, బోయిన విజయ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సల్మా, కొచ్చెర్ల రాకేష్ కాంత్, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img