కూలీ డబ్బులే కూనికి కారణం
సర్వాయిగ్రామ హత్యకేసులో వ్యక్తి అరెస్టు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామంలో జరిగిన మడి రాజ బాబు(40) హత్య కేసులో నిందితుడు మంగళవారంపోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, కన్నాయిగూడెం ఏస్సై ఈ. వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు..నిందితుడు కొరం రంజిత్ బావ దగ్గర ఇంటి నిర్మాణ పనులు చేసి తనకు రావాల్సిన కూలీ పైసలు అడిగాడు. పని చేసిన మిగతా కూలీ వారికి డబ్బులు ఇచ్చి తనకు ఇవ్వడానికి నిరాకరించడంతో కూలీ పని డబ్బుల గురించి నిందితుడి బావని నిలదీశాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని తన బావను డబ్బులు అడుగుతావా అని కోడి కత్తితో రాజబాబు ప్రక్కటెముకల భాగంలో పోడవడంతో తీవ్ర రక్త స్రావమై మృతి చెందాడు. అనంతరం నిందితుడు పారిపోవడంతో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, కన్నాయిగూడెం ఏస్ఐ ఈ.వెంకటేశ్, తదితర పోలిస్ సిబ్బంది నిన్న సాయంత్రం కొరం రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొరం రంజిత్‌ను అరెస్ట్ చేసి కొర్టులో హజరు పరిచి రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఏటూరునాగారం సీఐ తెలిపారు.


