ముగిసిన చేర్యాల మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ
చివరి రోజు పుంజుకున్న నామినేషన్లు
కాకతీయ, చేర్యాల : ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డు స్థానాలకు బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలనను శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు అధికారులు చేపట్టారు. మొదటి రెండు రోజులు మందకోడిగా నామినేషన్లు దాఖలు కాగా.. చివరి రోజు శుక్రవారం పుంజుకున్నాయి. చివరి రోజు వరకు 59 నామినేషన్లు వచ్చాయి. దీంతో మూడు రోజుపాటు 85 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్. నాగేందర్ తెలిపారు. కాగా శనివారం నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల అర్హతల ఫిర్యాదులకు సంబంధించిన అప్పీళ్లకు ఆదివారం అవకాశం కల్పించనున్నారు.ఆదివారం వచ్చిన అప్పీళ్లను ఆ మర్నాడు సోమవారం పరిశీలిస్తారు. అనంతరం పోటీలో ఉన్న అర్హులైన అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 3న సాయంత్రం ప్రకటిస్తారు. వారికి గుర్తులను కూడా కేటాయిస్తారు.


