- న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
కాకతీయ, బయ్యారం : మండలంలో సుస్థిర పాలన కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో న్యూ డెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సుద్దరేవు, నారాయణపురం గ్రామాలలో స్థానిక ఎన్నికల గ్రామ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐలయ్య పాల్గొని మాట్లాడారు.
న్యూ డెమోక్రసీ పార్టీ పేదల పార్టీ అని, గిరిజనుల పోడు భూముల హక్కులకై అలుపెరగని పోరాటం చేసిన పార్టీ అని గుర్తు చేశారు. భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, బూర్జవ పార్టీలకు ఎదురొడ్డి నిలబడి ఎందరో అమరులయ్యారని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించి మన ఊరు మనమే పరిపాలించుకుంమని, సిద్ధాంతానికి కట్టుబడి పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో నందగిరి వెంకటేశ్వర్లు, ఐలయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు


