కగార్ పేరుతో కేంద్రం హత్యాకాండ
దుర్మార్గపు విధానాలను ప్రశ్నించే వారిపై నరమేధం
బూటకపు ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలి
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్
కమ్యూనిస్టులపై బీజేపీ ప్రభుత్వం నరమేథం : సీపీఐ ఎంఎల్ నాయకులు కేజీ రామచందర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దేశ ప్రజల సంపదను, వనరులను దోచుకుంటున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడే వారిని బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపుతున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. బుధవారం ఖమ్మంలో రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకుల యొక్క దుర్మార్గపు విధానాలను ప్రశ్నించే వారిని నరమేధంతో నిర్మూలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కగార్ పేరుతో దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా కొనసాగిస్తున్న బూటకపు ఎంకౌంటర్ల హత్యాకాండపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించి, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే బూటకవు ఎన్కౌంటర్ల హత్యాకాండను, కగార్ హ త్యాకాండను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపటానికి ముందుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరిస్తుందని, మొదట చర్చలకు సిద్ధమైన అని ప్రభుత్వం ప్రకటించి ఆచరణలో మోసం చేసిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలో హక్కుల ప్రకారం ప్రశ్నించడం, ప్రజాస్వామ్య ప్రక్రియ లోక్సభ స్వతంత్రం, దేశం రానున్న కాలంలో చీకటి రాజ్యంగా మారుతుందని ఆయన అన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని,దోషులను కఠినంగా శిక్షించాలని, సుప్రీంకోర్టు జడ్జితో న్యాయచాను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టులపై బీజేపీ ప్రభుత్వం నరమేథం : సీపీఐ ఎంఎల్ నాయకులు కేజీ రామచందర్
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచందర్ మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులు కమ్యూనిస్టులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం నరమేథం కొనసాగిస్తుందని ఈ హ త్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడే వంద సంవత్సరాలు అవుతున్నదని, డిసెంబర్ 26న పురస్కరించుకొని 25న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సభలను నిర్వహిస్తున్నామని, అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. సామాజిక స్థితి మూలంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని, నేడు మావోయిస్టుల ఆధ్వర్యంలో తిరుగుబాటు జరుగుతుందని, ప్రజలు ఎంతవరకు దోపిడికి గురైతే అంత మేరకు తిరుగుబాటు సాగుతుందని, రష్యా, చైనాలో కూడా తిరుగుబాట్లు జరిగాయని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి ముందు అనేక వాగ్దానాలు చేశారని రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. రైతాంగానికి ఇస్తానన్న 500 రూపాయల బోనస్‌ను అమలు చేయడం లేదని, రైతాన్ గారికి గిట్టుబాటు ధరలు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు రైతాంగాన్ని నడ్డి బిరుస్తున్నాయని గజతప్పిన చెడు పీడనలు ఆవరిస్తున్నాయని ఈ స్థితిలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో మానవ హరణం : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, హ్యాపీ రాష్ట నాయకులు గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ, సెప్టెంబర్ నెల కర్రగుట్టల నుంచి ప్రారంభమైన దాడులు,హత్యలు నేడు బీకరంగా కొనసాగుతూ మానవహరణం జరుగుతుందని, చరిత్రలో నరహంతకులు పోయారు తప్ప నక్సలైట్లు, ప్రజా నాయకులు నిర్మూలన జరగలేదని ఆయన అన్నారు. అభివృద్ధి నిరోధకులని ముద్ర లేసి అభివృద్ధి పాలకులుగా చలామణి అవుతూ ప్రజా నాయకుల పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. హిడ్మా చనిపోయిన దృశ్యాన్ని చూస్తే, పండ్లు విరిగిపోయి,శరీరం చిద్రమైనదిగా ఉందని,ఇది ముమ్మాటికీ బూటక ఎన్కౌంటరని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలతో పరిశీలిస్తామని మొదట చెప్పి, తర్వాత ఎన్కౌంటర్ హత్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పద్ధతి మార్చుకోవటానికి అంగీకారానికొచ్చినా కాల్చి చంపటం అప్రజా స్వామికమైన నియంత్రత్వమైన చర్యని ఆయన విమర్శించారు. విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ నాయకురాలు కే రమ,కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, చిన్న చంద్రన్న, నందిరామయ్య, సదానందం,పిట్ల రామకృష్ణ, నాయిని రాజు,సివై పుల్లయ్య, జిరామయ్య, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది.


