- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి వాల్మీకి ఆధ్యాత్మికవేత్తగా రామాయణం రచించి ఆదికవిగా వెలుగొందారని, రామాయణం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని అన్నారు. అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి.జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


