కాకతీయ, బయ్యారం: ఎన్నికల ముందు యిచ్చిన హామీ లను అమలు చేయాలని మంగళవారం గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో లో జరిగిన జనరల్ బాడీ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఈసందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక ఉచిత పథకాలకు ,హామిలిచ్ఛి అధికారంలోకి వచ్చిన, తర్వాత గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప, ఏ ఒక్కటి అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.
దేశానికి రైతే రాజు అని పాలకులు చెప్పడమే తప్ప, రైతులకు సరైనటువంటి కాలంలో యూరియా అందించలేని దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వంలో నెలకొని ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి రావలసిన ఎరువులు రావడంలేదని, ప్రచారం చేయడం తప్ప ,ముందు జాగ్రత్త చర్యగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించడం కోసం తగిన చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
ఈకార్యక్రమంలో బండారి ఐలయ్య, జిల్లా నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మోకాళ్ళ మురళీకృష్ణ మాదంశెట్టి నాగేశ్వరావు, ఊకే పద్మ, తుడుం వీరభద్రం, రామగిరి బిక్షం ,తోకల వెంకన్న, నేతకాని రాకేష్,ఏపూరి వీరభద్రం, రామచంద్రుల మురళి, ఐలయ్య, శేషు ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.


