ఇందిరమ్మ ఇంటికి తొలి వెలుగు
రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు తుమ్మల యుగంధర్
ఖమ్మం 40వ డివిజన్‌లో గృహప్రవేశానికి హాజరు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలోని 40వ డివిజన్ మోమినాన్ బజార్‌లో నిర్మించిన తొలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని, ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో ఖమ్మంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మొట్టమొదటిగా మైనారిటీ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం జరగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల పట్ల ఉన్న సమాన గౌరవానికి నిదర్శనమన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు కలగడం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోందని, భవిష్యత్తులో మరింత మంది లబ్ధిదారులకు ఈ పథకం చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఖమ్మం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నవాజ్, సిటీ మైనారిటీ అధ్యక్షుడు అబ్బాస్ బేగ్, జిల్లా యువ నాయకుడు మహమ్మద్ అష్రిఫ్, ఖమ్మం వన్‌టౌన్ ఇన్‌చార్జ్ ఖాదర్ బాబా, 41వ డివిజన్ అధ్యక్షుడు అల్సాద్, టౌన్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అల్లే సాయికిరణ్, 40వ డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ అహద్, అజీమ్, ఎస్‌కే జావీద్, సంపత్, ఇరాఫాన్ (సిటీ ఫుట్‌వేర్), జహంగీర్, సల్మాన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


