- తుఫాన్ నష్టం నివేదిక తయారీపై ఖమ్మం కలెక్టర్ ఆదేశాలు
- సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్ష
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా తుఫాన్ నష్టం నివేదిక తయారు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ నష్టం నివేదిక తయారీపై సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా తుఫాన్ నష్టం అంచనా నివేదికలను తయారు చేయాలని, ఎక్కడ కూడా ఒక ఫిగర్ తప్పు ఉండటానికి వీలు లేదని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి పరిహారం ప్రభుత్వం నుంచి అందేలా చూడాలని అన్నారు. నష్టం అంచనా తయారీలలో ఎటువంటి అక్రమాలకు పాల్పడటానికి వీలు లేదని, పూర్తి పారదర్శకంగా రూపొందించాలని, వీటిని క్రాస్ చెక్ చేయడం జరుగుతుందని తప్పుడు నివేదికలు ఎక్కడైనా తెలిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ , వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


